: కేరళ బయలుదేరిన అల్లోల... శబరిమలలో ‘తెలంగాణ విడిది’కి ఒప్పందం


తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నేటి ఉదయం కేరళ రాజధాని తిరువనంతపురం బయలుదేరి వెళ్లారు. పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమలలో తెలంగాణ భక్తుల కోసం ఓ గెస్ట్ హౌస్ ను ఏర్పాటు చేసేందుకు గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆయన కేరళ సీఎం ఉమెన్ చాందీతో చర్చలు కూడా జరిపారు. ఐదెకరాల స్థలిమిస్తే తమ రాష్ట్ర భక్తుల కోసం గెస్ట్ హౌస్ కట్టుకుంటామన్న కేసీఆర్ విజ్ఞప్తికి ఉమెన్ చాందీ కూడా సరేనన్న విషయమూ తెలిసిందే. ఈ మేరకు నేడు తిరువనంతపురంలో ఉమెన్ చాందీ సర్కారుతో ఇంద్రకరణ్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గెస్ట్ హౌస్ కోసం కేరళ ప్రభుత్వం ఇవ్వనున్న భూమి బదలాయింపుపై ఇరు ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

  • Loading...

More Telugu News