: కేసీఆర్ సర్కారుతో ఐబీఎం డీల్
టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) మధ్య ఓ డీల్ కుదిరింది. ఇందులో భాగంగా, రాష్ట్రంలోని ఇంజినీరింగ్ అధ్యాపకులకు, విద్యార్థులకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అవసరమైన క్లౌడ్ సేవలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఐబీఎం నిర్ణయించింది. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో టాస్క్, ఐబీఎం అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. 'బ్లూమిక్స్' పేరిట 2014లో ఐబీఎం ప్రారంభించిన క్లౌడ్ టెక్నాలజీ ఫ్లాట్ ఫాంకు మంచి గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. బ్లూమిక్స్ ప్రస్తుతం డేటా, మొబైల్, వాట్సన్, అనలిటిక్స్, ఇంటిగ్రేషన్, డెవ్ ఓపీఎస్, సెక్యూరిటీ, ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) తదితర విభాగాల్లో 120 రకాల టూల్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.