: భారత్ ను వెంటాడుతున్న ఓటమి భయం...పాక్ మాజీ క్రికెటర్ మియాందాద్ సంచలన వ్యాఖ్య
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ మరోమారు టీమిండియాపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పైనా అతడు నోరు పారేసుకున్నాడు. ఓటమి భయం కారణంగానే పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ కు టీమిండియా వెనుకంజ వేస్తోందని వ్యాఖ్యానించాడు. ఈ కారణంగానే ఈ ఏడాది చివరిలో యూఏఈ వేదికగా జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ పై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోందని మియాందాద్ పేర్కొన్నాడు. బీసీసీఐ వెనుకంజ నేపథ్యంలో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయాలని అతడు సూచించాడు.