: బిల్లు కట్టమన్నాడని ధాబా యజమానిని కాల్చేసిన కానిస్టేబుల్
చేసిన భోజనానికి బిల్లు చెల్లించాలని అడిగినందుకు ధాబా యజమానిని కానిస్టేబుల్ కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. సహారన్ పూర్ కు చెందిన కపిల్ మాలిక్ అనే కానిస్టేబుల్ సమీపంలోని ఓ ధాబాకు వెళ్లాడు. కావాల్సినవి ఆర్డర్ చేసి సుష్టుగా భోజనం చేశాడు. తర్వాత దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోతున్న కానిస్టేబుల్ ను ధాబా యజమాని ఆపి బిల్లు చెల్లించాలని కోరాడు. దీనిపై ఆగ్రహించిన కపిల్ మాలిక్ ధాబా యజమానిని కాల్చి చంపేశాడు. అడ్డువచ్చిన మరో ఉద్యోగిని కూడా కాల్చేశాడు. దీనిపై హోటల్ యజమానుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ధాబా యజమాని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, కానిస్టేబుల్ కపిల్ మాలిక్ ను అదుపులోకి తీసుకున్నారు.