: సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటన: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ


సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన జరుపుతున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐలో జరిగిన అవినీతిపై సీబీఐ ప్రశ్నిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని అడిగారు. అవినీతికి పాల్పడితే కుమారుడు, కుమార్తె అని కూడా చూడనని ఘనంగా ప్రకటించిన కేసీఆర్, తనపై వస్తున్న ఆరోపణలు, సీబీఐ ప్రశ్నలకు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. సీబీఐ విచారణపై కేసీఆర్ మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News