: ఏపీ కాంగ్రెస్ 'మట్టి సత్యాగ్రహం' కార్యక్రమంపై జూపూడి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా ప్రధాని మోదీకి రాష్ట్రంలోని 16వేల గ్రామాల నుంచి మట్టిని సేకరించి పంపే 'మట్టి సత్యాగ్రహం' కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది. దీనిని చేపట్టిన ఏపీ కాంగ్రెస్ నేతలపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు విజయవాడలో మండిపడ్డారు. పుట్టమట్టి కాదు, బొందల మట్టి సేకరించి సోనియాకు పంపండని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎప్పుడో ప్రజలు బొందపెట్టారని, ఈ విషయాన్ని మీ అధినేత్రికి మొరపెట్టుకొండని ఆయన అన్నారు. రాజధానికి పవిత్రభావంతో ప్రజలు మట్టి సేకరిస్తే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం దారుణమని జూపూడి అన్నారు.