: ఖమ్మం జిల్లా గార్లలో భారీగా పేలుడు పదార్థాల పట్టివేత
ఖమ్మం జిల్లాలోని గార్లలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. ఓ ట్రాక్టర్ లో తరలిస్తున్న 137 జిలెటిన్ స్టిక్స్, 152 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.