: పైరసీ నిర్మూలనకు కొత్త పాలసీని తీసుకొస్తామని టి.సర్కార్ చెప్పింది: నిర్మాత సురేష్ బాబు
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. పైరసీ నిర్మూలనకు ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తుందని చెప్పారన్నారు. ఆన్ లైన్ పైరసీని అరికట్టే విషయంపై పలువురు సినీరంగ ప్రతినిధులు ఇవాళ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఇంటర్ నెట్ ప్రొవైడర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పోలీసులు, ఇంటర్ నెట్ ప్రొవైడర్లు, సినీ పరిశ్రమ వర్గాలు కలిస్తే పైరసీని అరికట్టొచ్చన్నారు. పైరసీ కోసం 200 వెబ్ సైట్లు పని చేస్తున్నాయని, గడచిన 9 నెలల్లో పరిశ్రమకు రూ.350 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు.