: దీపావళి బాణాసంచాపై నిషేధం విధించేందుకు సుప్రీం నిరాకరణ
దీపావళి రోజున కాల్చే బాణాసంచాపై నిషేధాన్ని విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పండగ రోజున బాణాసంచా వినియోగంపై నిషేధం విధించడం సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వేచ్ఛగా బాణాసంచా కాల్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. దసరా, దీపావళి రోజుల్లో బాణాసంచా వాడకంపై పూర్తి స్థాయి నిషేధం విధించాలని కోరుతూ గతంలో ముగ్గురు చిన్నారులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది.