: 'గ్రేట్' అని మరోసారి ప్రశంసలందుకున్న ఈధీ ఫౌండేషన్


పాకిస్థాన్ లో ఎంతో మంది విధి వంచిత బాలలను సాకుతూ గొప్ప మనసు చాటుకుంటూ, భారత్ కు చెందిన మూగ, బధిర బాలిక గీతను సొంత బిడ్డలా చూసుకుని, పెంచి, పెద్దచేసి, స్వదేశం చేర్చిన ఈధీ ఫౌండేషన్ భారత్, పాక్ లలో అందరిచేతా శభాష్ అనిపించుకుంది. గీతపట్ల చూపిన ఆదరణకు స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ కోటి రూపాయల విరాళాన్ని ఈధీ ఫౌండేషన్ కు ప్రకటించారు. అయితే మోదీ ప్రకటించిన విరాళాన్ని ఈధీ ఫౌండేషన్ సున్నితంగా తిరస్కరించింది. తాము ప్రభుత్వాల నుంచి విరాళాలు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. అయితే మోదీ ఈ మొత్తాన్ని భారత్ లోని మూగ, బధిర బాలలు ఆశ్రయం పొందుతున్న స్వచ్ఛంద సంస్థకు అందజేస్తే సంతోషిస్తామని ఈధీ ఫౌండేషన్ తెలిపింది. దీంతో, ఈధీ ఫౌండేషన్ రెండు దేశాల ప్రజలతో మరోసారి గ్రేట్ అనిపించుకుంది.

  • Loading...

More Telugu News