: టిక్కెట్టు లేని రైల్వే ప్రయాణికుల సంఖ్య 2.57 లక్షలు.. జరిమానాగా రూ.11.36 కోట్లు వసూలు
ఈ ఏడాదిలో కేవలం ఐదు నెలల్లోనే రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారి సంఖ్య లక్షల్లో ఉందని ఉత్తర రైల్వేకు చెందిన పంజాబ్ ఫిరోజ్ పూర్ డివిజన్ అధికారులు తెలిపారు. తమ డివిజన్ లో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ నుంచి సెప్టెంబరు 15 వరకు టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న సుమారు 2.57 లక్షల మందిని పట్టుకున్నామన్నారు. వారికి జరిమానా విధించడం ద్వారా రూ.11.36 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. ఫిరోజ్ పూర్ డివిజన్ లో అమృత్ సర్, జలంధర్, హోషియాపూర్, లూథియానా, వప్రోలా మొదలైన నగరాలున్నాయన్నారు. పండగ సీజన్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడమే కాకుండా భద్రత కూడా పెంచామని రైల్వే అధికారులు తెలిపారు.