: ఎన్నికల ముందు స్వర్గం చూపి... ఇప్పుడు నరకం చూపిస్తున్నారు: పొన్నాల


టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. గత 15 నెలల నుంచి రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని, రైతులను గాలికొదిలేశారని ఆరోపించారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ వెనుకబడి ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కదలిక రాలేదని అన్నారు. కరవు మండలాలను ప్రకటించే విషయంలో కూడా శ్రద్ధ లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు పలు హామీలతో స్వర్గం చూపించారని... ఇప్పుడు నరకం చూపిస్తున్నారని అన్నారు. వరంగల్ కు ఉప ఎన్నిక తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందని... దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News