: తెలంగాణ ట్రెజరీ నియమావళిపై స్టీరింగ్ కమిటీ ఏర్పాటు


తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ నియమావళిని కొత్తగా రూపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఇందులో 14 మంది సభ్యులు ఉంటారని తెలుపుతూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రెటరీ ప్రదీప్ చంద్ర ఛైర్మన్ గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి పదిహేను రోజులకొకసారి ఈ కమిటీ సమావేశమై కొత్తగా రూపొందించాల్సిన ట్రెజరీ నియమావళిపై కసరత్తు చేస్తుంది.

  • Loading...

More Telugu News