: రాష్ట్రపతిని కలసిన గీత, ఈదీ ఫౌండేషన్ సభ్యులు
పాకిస్థాన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన గీత ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ఆమెతో పాటు ఈదీ ఫౌండేషన్ సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిశారు. దానికి సంబంధించిన ఫోటోలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. "భారత్-పాకిస్థాన్ దేశాలకు నీవు కుమార్తెవు, ఇరు దేశాల ఐక్యతకు గుర్తుగా గీత ఉంటుంది" అంటూ ప్రణబ్ ట్వీట్ చేశారు. మరోవైపు గీత తల్లిదండ్రులమంటూ వచ్చిన వారి డీఎన్ఏ పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది.