: వెంకన్న ప్రసాదం మరింత ప్రియం, ఆర్జిత సేవలు కూడా!...చదలవాడ అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ
తిరుమల వెంకన్న సేవలు మరింత ప్రియం కానున్నాయి. తిరుమలలో ఆర్జిత సేవలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వెంకన్న ప్రసాదం తిరుమల లడ్డూ ధరలను పెంచాలని ఇదివరకే తిరుమల తిరుపతి దేవస్థానం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లడ్డూ తయారీ వ్యయం పెరిగిన నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలంటే ధర పెంచక తప్పదని ఇప్పటికే టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ధర పెంపు, ఆర్జిత సేవల ధరల పెంపు తదితర కీలక నిర్ణయాలు తీసుకునేందుకు చదలవాడ అధ్యక్షతన టీటీడీ బోర్డు కొద్దిసేపటి క్రితం తిరుపతిలో భేటీ అయ్యింది. ధరల పెంపుతో పాటు కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత చర్యలపైనా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.