: 9 మంది రెవెన్యూ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు


శ్రీకాకుళం జిల్లాలో 9 మంది రెవెన్యూ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ లక్ష్మినరసింహం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాటు పలు ఆరోపణలు వారిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన అనంతరం వారిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సస్పెండైన వారిలో డిప్యూటీ తహశీల్దార్ (డీటీ), ఇద్దరు ఆర్ఐలు, ఆరుగురు వీఆర్వోలు ఉన్నారని సంబంధిత శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News