: దర్శకుడు శ్రీను వైట్లపై వేధింపుల కేసు పెట్టిన భార్య
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీను వైట్లపై ఆయన భార్య సంతోషి రూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీను వైట్ల తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్శకుడు శ్రీను వైట్లపై కేసు నమోదు చేశారు. కాగా, శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన బ్రూస్ లీ సినిమా ఈ మధ్యే విడుదలైన సంగతి తెలిసిందే.