: మామ కల్యాణ్ రామ్ ఒళ్లో దేవాన్ష్
తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ ను మామ, ప్రముఖ సినీనటుడు కల్యాణ్ రామ్ ముద్దు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం ముగిశాక తిరుగుప్రయాణం సందర్భంలో కల్యాణ్ రామ్ ఒళ్లో దేవాన్ష్ కూర్చున్నాడు. ఆ తర్వాత చక్కగా నిద్రపోయాడు. ఈ ఫొటోను కల్యాణ్ రామ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలో కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యరామ్ కూడా ఉన్నాడు. దేవాన్ష్ తన బోసి నవ్వులతో అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పలువురిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే.