: ప్రేమ వేధింపులకు విద్యార్థిని బలి


ప్రేమ వేధింపులకు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా పెన్ పహాడ్ గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్సై జాఫర్ బేగ్ తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎ.శ్రావణి పదోతరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన మేకల వినోద్ తనను ప్రేమించమంటూ శ్రావణిని వేధిస్తుండేవాడు. ఈ వేధింపులు భరించలేక శ్రావణి సోమవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు తమ కూతురును సూర్యాపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగా శ్రావణి ప్రాణాలు విడిచింది. మృతురాలి తండ్రి రామలింగయ్య ఫిర్యాదు మేరకు వినోద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News