: మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ చోటారాజన్ అరెస్టయ్యాడు. ఇండోనేషియాలోని బాలిలో అతడిని ఇంటర్ పోల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం మేరకు ఇంటర్ పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేశాయి. 55 ఏళ్ల రాజన్ 1995 నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పటికీ ముంబైలో జరుగుతున్న పలు ఘటనలలో అతని హస్తం ఉందని చెబుతుంటారు. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహిత సహచరుడైన రాజన్... తరువాత అతనికే గట్టి ప్రత్యర్థిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు దాదాపు రెండు దశాబ్దాల నుంచి అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో చోటా రాజన్ ను పట్టుకున్నారు.