: అరాచకమైనా సరే, పిల్లలపై అత్యాచారాలకు ఆ శిక్షే విధించాలి!: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్య
చిన్నారి బాలికలపై నానాటికీ పెరిగిపోతున్న అత్యాచారాలను ప్రస్తావించిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్.కిరుబకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలను ఆపేందుకు ఒకటే శిక్ష ఉందని, వీరికి 'విత్తుకొట్టాలి' అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలు ఎలాంటి ప్రభావం చూపించడం లేదని, అరాచకమైనా, ఈ తరహా నేరాలకు అటువంటి శిక్షలే విధించాలని ఆయన అన్నారు. గడచిన ఏడేళ్లలో చిన్నారులపై జరిగిన అత్యాచారాల్లో కేవలం 2.4 శాతం కేసుల్లోనే శిక్షలు పడ్డాయని, ఇదే సమయంలో కేసుల సంఖ్య 400 శాతం పెరిగిందని గుర్తు చేశారు. అమెరికాలో అత్యాచారాలకు పాల్పడిన వారిని నపుంసకులుగా మార్చే శిక్షలు ఉన్నందునే అక్కడ ఇటువంటి నేరాలు తగ్గాయని తెలిపారు.