: చంద్రబాబుతో భేటీ కానున్న స్పీకర్ కోడెల... తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణంపై చర్చ


ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కాసేపట్లో సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ కానున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించనున్న తాత్కాలిక అసెంబ్లీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణంపై రూపొందిన బ్లూప్రింట్ లను చంద్రబాబు ముందు కోడెల పెట్టనున్నారు. డిసెంబర్ లో జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను కొత్తగా ఏర్పాటు కానున్న తాత్కాలిక అసెంబ్లీలోనే నిర్వహించాలని ఇదివరకే తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News