: బీహార్ అభివృద్ధికి ఆ మూడు అవసరం: మోదీ
బీహార్ అభివృద్ధికి మూడు అంశాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. నలందలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, బీహార్ కు నీరు, విద్యుత్, రోడ్లు అవసరమని అన్నారు. బీహార్ లో బీజేపీ మిత్రపక్షాలను ఎన్నుకుంటే ఆ మూడు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. బీహార్ లో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు లేక యువత వలస బాటపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచి వలసలు నివారిస్తామని ఆయన తెలిపారు. బీహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.