: నేను టీఆర్ఎస్ లో చేరడం లేదు: మాజీ ఎంపీ వివేక్
తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని కాంగ్రెస్ నేత, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ ను వీడేది లేదని తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కేకే నివాసంలో మంత్రి హరీష్ రావుతో జరిగిన భేటీలో టీఆర్ఎస్ లో చేరాలని, వరంగల్ లోక్ సభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా నిలబడాలని వివేక్ ను వారు కోరినట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజాగా వివేక్ మాట్లాడుతూ, తాను పార్టీ మారడం లేదని, టీఆర్ఎస్ లో చేరడం లేదని స్పష్టం చేశారు. కాగా, వీరి భేటీపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.