: నల్లగొండలో టేబుల్ టెన్నిస్ స్టేడియం నిర్మిస్తాం: మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండలో త్వరలోనే టేబుల్ టెన్నిస్ స్టేడియంను నిర్మిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆత్మస్థయిర్యం పెరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు, కోచ్ లు హాజరయ్యారు.