: హైటెక్ హైదరాబాదులో 9 నెలల్లో 2,900 యాక్సిడెంట్లు


విశాలవంతమైన రహదారులు, ఎల్ఈడీ వీధి దీపాలు ఉన్నప్పటికీ, హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న రహదారి ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. నగరం మధ్య ప్రాంతాన్ని వదిలేసినా, గత 15 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన సైబరాబాద్ పరిధిలో రహదారులు విశాలంగానే ఉన్నాయి. ఈ రోడ్లపై జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 2,962 రోడ్డు ప్రమాదాలు జరుగగా, 859 మంది మరణించినట్టు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో 500 కూడళ్లు ఉండగా, కేవలం 180 చోట్ల మాత్రమే ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ ఉందని తెలుస్తోంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో రోజుకు 1200 కొత్త వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయని అంచనా. తగినంత పోలీసు సిబ్బంది లేకపోవడం వల్లనే పూర్తి పర్యవేక్షణ సాధ్యం కావడం లేదన్నది పోలీసు ఉన్నతాధికారుల వాదన. ప్రజలు సైతం నిబంధనలను పాటించకపోవడం వల్లే వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News