: ఇంగ్లీషులో మాట్లాడినందుకు నవాజ్ షరీఫ్ పై కేసు
అధికార భాష ఉర్దూను వదిలి ఆంగ్లంలో మాట్లాడినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పై పాకిస్థాన్ సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. 70వ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో షరీఫ్ ఇంగ్లీషులో మాట్లాడారని, ఇది పాక్ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకమని జహీద్ ఘనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, కేసు నమోదుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు 'డాన్' పత్రిక వెల్లడించింది. ఇవే సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హిందీలో మాట్లాడారని గుర్తు చేసిన ఆయన, రష్యన్ భాషలో వ్లాదిమిర్ పుతిన్, చైనా భాషలో క్సీ జిన్ పింగ్, జపాన్ భాషలో షింజో అబేలు ప్రసంగిస్తే, నవాజ్ షరీఫ్ మాత్రం ఉర్దూను వదిలి, ఇంగ్లీషులో మాట్లాడటం, జాతికే అవమానకరమని తెలిపాడు. ఇది తీవ్రమైన నేరమని, విచారించి శిక్షించాలని జహీద్ కోరాడు.