: సీఎం సహాయనిధి అంటే కరవు నిధి అని కాదు: ఫడ్నవీస్
ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కేవలం కరవు బాధితులకు మాత్రమే అందించే నిధి మాత్రమే కాదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బ్యాంకాక్ లో నృత్యప్రదర్శనలో పాల్గోనున్న ఓ బృందానికి 8 లక్షల రూపాయలు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎనిమిది రంగాలకు అందజేయవచ్చని తెలిపారు. కళల ప్రోత్సాహానికి కూడా సీఎం సహాయనిధిని వినియోగించవచ్చని ఆయన వెల్లడించారు. కాగా, నృత్య బృందానికి 8 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రైతులు సాగుభారమై ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఆదుకునేందుకు ప్రయత్నాలు చేయడం లేదు కానీ నృత్య బృందానికి లక్షలు సాయం చేసేందుకు సీఎం ఉత్సాహం చూపించారని వారు విమర్శిస్తున్నారు.