: సామాన్యుడు ఆర్టీసీ బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది: తమ్మినేని సీతారాం
ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలను పెంచడంపై వైకాపా అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. క్రూడాయిల్, డీజిల్ ధరలు తగ్గినా బస్సు ఛార్జీలను పెంచడం దారుణమని అన్నారు. అయిదేళ్లపాటు ఆర్టీసీ ఛార్జీలను పెంచబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి రాగానే హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. ఈ రోజు హైదరాబాదులోని పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలను పెంచి... ప్రైవేటు ఆపరేటర్లకు మేలు కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.