: మాల్దీవుల వైస్ ప్రెసిడెంట్ పై దేశద్రోహం కేసు... అరెస్ట్


మాల్దీవుల ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ పై దేశద్రోహం కేసు నమోదయింది. ఈ క్రమంలో మాల్దీవియన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని జైల్లో ఉంచారు. దేశ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ను హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో అదీబ్ పై కేసు నమోదైంది. గత నెలలో అధ్యక్షుడు అబ్దుల్లా బోటులో ప్రయాణిస్తుండగా, బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో అధ్యక్షుడు క్షేమంగా బయటపడగా, ఆయన భార్య, భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక అదీబ్ హస్తం ఉందనే కోణంలో, అతనిపై దేశద్రోహం నేరం మోపారు. చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఆయనను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News