: ఢాకాలో వరుస బాంబుపేలుళ్లు


బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వరుస బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. ఈ తెల్లవారుజామున ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 17వ శతాబ్దానికి చెందిన షియాల ప్రార్థనా స్థలం వద్ద దుండగులు పేలుళ్లకు తెగబడ్డారు. మొహర్రం సందర్భంగా నిర్వహించే అసుర వేడుక కార్యక్రమాన్ని వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చిన సందర్భంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 90 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ పేలుళ్లకు తామే కారణం అంటూ ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటన చేయలేదు. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఈ దాడులకు పాల్పడ్డారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News