: సినిమా వాళ్ల గొడవలన్నీ మీడియా కల్పితాలే: రవితేజ
సినిమా వాళ్ల మధ్య గొడవలన్నీ మీడియా వాళ్లు కల్పించినవేనని ప్రముఖ సినీ నటుడు రవితేజ తెలిపాడు. బెంగాల్ టైగర్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, సినీ రంగంలో పోటీ ఉంటుందని అన్నాడు. అయితే అది ఆరోగ్యకరమైన పోటీ తప్ప ద్వేషాలు పెంచుకునే స్థాయి పోటీ కాదని స్పష్టం చేశాడు. సినీ నటులంతా ఏదో ఒక సందర్భంలో కలుస్తుంటారని అప్పుడు వారి మధ్య ఆప్యాయతలు చూస్తే వారి మధ్య ఉన్నది స్నేహమో లేక వైరమో తెలుస్తుందని చెప్పాడు. ప్రతి రంగంలోనూ చిన్నచిన్న కలహాలు, అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని రవితేజ అన్నాడు. సినీ నటుల విషయంలో మీడియా మసాలాలు దట్టించి వండి వారుస్తుందని, దీంతో ఈ రంగంలో ఒకరంటే ఒకరికి పడదని అంతా భావిస్తారని రవితేజ చెప్పాడు.