: వీకే సింగ్ పై నిన్న కేజ్రీవాల్...నేడు ఆప్
కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్ పై డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేయగా, నేడు ఆమ్ ఆద్మీ పార్టీ వీకే సింగ్ పై పార్లమెంటరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. హర్యాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో దాద్రి గ్రామంలో దళితులు నిద్రిస్తున్న సమయంలో వారింట్లో పెట్రోలు పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీనిపై వీకే సింగ్ మాట్లాడుతూ, కుక్కపై ఎవరైనా రాయివేస్తే దానికి కేంద్రానిది బాధ్యత అంటే ఎలా? అని అన్నారు. దీనిపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తక్షణం ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. తాజాగా ఆప్ వీకే సింగ్ వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయనను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. వీకే సింగ్ దళితులను అవమానించారని, అలాంటి వారిని క్షమించరాదని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.