: అమెరికా పర్యటనకు ఏపీ మంత్రి పల్లె.... పెట్టుబడులు రాబట్టేందుకేనట!
ఏపీ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కొద్దిసేపటి క్రితం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబుడులు రాబట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనకు బయలుదేరినట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే నెల 4వ తేదీ వరకు దాదాపు 11 రోజుల పాటు సుదీర్ఘంగా అక్కడ పర్యటించనున్న పల్లె, ఏ మేరకు పెట్టుబడులు రాబడతారో చూడాలి. రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం పలు దేశాల్లో చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా గతంలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో పల్లె ఐటీ కంపెనీలతో వరుస భేటీలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.