: మరో పదేళ్లలో భారత్ ను మించిపోనున్న పాకిస్థాన్
పాకిస్థాన్ మరో పదేళ్లలో భారత్ ను మించిపోనుంది. గత 20 ఏళ్లుగా వివిధ దేశాల నుంచి అణ్వస్త్రాలను కొనుగోలు చేస్తున్న పాక్ పదేళ్లలో అణ్వస్త్ర సామర్థ్యంలో భారత్ ను మించిపోవడం ఖాయమని అమెరికాకు చెందిన అటామిక్ సైన్స్ తెలిపింది. పదేళ్లలో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన టాప్ 5 దేశాల్లో పాకిస్థాన్ ఉంటుందని అటామిక్ సైన్స్ వెల్లడించింది. ప్రస్తుతం పాక్ వద్ద వంద వార్ హెడ్స్ ఉన్నాయని అటామిక్ సైన్స్ పేర్కొంది. వీటి సంఖ్య 2025 నాటికి 250కి పెరుగుతుందని అటామిక్ సైన్స్ తెలిపింది. అప్పటికి 6వ స్థానంలో నిలిచే భారత్ కంటే పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు ఎక్కువగా ఉంటాయని అమెరికన్ అటామిక్ సైన్స్ వెల్లడించింది. కాగా, ఎఫ్ 16 జెట్ ఫైటర్స్ ను పాక్ కు అమ్మేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. త్వరలో జరగనున్న ఒబామాతో భేటీలో షరీఫ్ ఈ డీల్ ను చర్చించవచ్చని అటామిక్ సైన్స్ వెల్లడించింది.