: మోదీకి దసరాపై నమ్మకం ఉంటే అతనిని బర్తరఫ్ చేయాలి: కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీకి దసరాపై నమ్మకం ఉంటే కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ ను తక్షణం మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని సూచించారు. దాద్రి ఘటనపై మాట్లాడుతూ, ఎవరో ఎక్కడో కుక్కను రాళ్లతో కొడితే దానికి ప్రధానిని నిందించాల్సిన పని లేదని వీకే సింగ్ పేర్కొన్నారు. దీనిపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీకే సింగ్ వ్యాఖ్యలు ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టం కింద నేరమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 'దసరా అంటే చెడు, అహంకారంపై విజయం' అనే నమ్మకం ఉంటే, ఆయన మంత్రి వర్గంలో ఉన్న ఆహంకారాన్ని తీసివేయాలని కేజ్రీవాల్ సూచించారు. సాయంత్రంలోగా వీకే సింగ్ ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.