: కనీసం ప్యాకేజీ కూడా ప్రకటించలేదు: రోజా
అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీకి ఉపయోగపడే ఒక్క మాటను కూడా చెప్పలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. పోలవరం, ఏపీ రెవెన్యూ లోటు అంశాలను ప్రస్తావించలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సహచరులు చెబుతున్న విధంగా కనీసం ప్యాకేజీ కూడా లేకపోయిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు వైకాపా అధినేత జగన్ ను అనుసరించి అడుగులో అడుగు వేయాలని... కేవలం జగన్ వల్లే ప్రత్యేక హోదా పోరాటానికి బలం వస్తుందని ఆమె అన్నారు.