: రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోదీ దిష్టి బొమ్మలు తగులబెట్టండి: రఘువీరా పిలుపు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలు తగులబెట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే, వారి ఆకాంక్షను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రధాని తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, అందుకు ప్రతిగా రేపు ప్రధాని దిష్టి బొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.