: దేవాన్ష్ కు తన కళ్లజోడు పెట్టిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను ముద్దాడారు. తన కళ్లజోడును దేవాన్ష్ కు పెట్టి, చేతిలో చేయి వేసి పిల్లలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ సమయంలో నారా భువనేశ్వరి, నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు మోదీతో ముచ్చటించారు. రాజధాని గ్యాలరీలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అనంతరం, గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మోదీ ఆసక్తిగా తిలకించారు. ఫొటోలలో ఉన్న వాటి ప్రాశస్త్యం గురించి చంద్రబాబుతో పాటు అధికారులు మోదీకి వివరించారు.