: మూడు బస్సుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీ... భుజానికి బ్యాగ్ తో కొత్త లుక్ లో బాలయ్య
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు దివంగత నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులంతా మూకుమ్మడిగా తరలివస్తున్నారు. నేటి ఉదయం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరిన ఆ కుటుంబం కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి నుంచి మూడు బస్సుల్లో ఎక్కిన ఎన్టీఆర్ కుటుంబం అమరావతికి బయలుదేరింది. ఓ బస్సులో ఎక్కిన టాలీవుడ్ అగ్ర హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భుజానికి బ్యాగ్ తగిలించుకుని కొత్త లుక్ లో కనిపించారు. దారి పొడవునా ఆయన అభిమానులకు అభివాదం చేస్తూనే ముందుకు సాగారు.