: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరు దగ్గర పది మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆటో గోస్తనీ నదిలోకి దూసుకెళ్లింది. దీనిని గుర్తించిన స్థానికులు సహాయక చర్యల చేపట్టారు. అధికారులకు సమాచారం అందజేసి, నదిలో గాలింపు చేపట్టారు. ఈ గాలింపులో పదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆటోలోని ప్రయాణికులు తణుకు నుంచి వేలివెన్ను వెళ్తున్నట్టు సమాచారం. స్థానికులు గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.