: అమరావతిలో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన పోలీసులు


నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపనా ప్రాంతంలో సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఈ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా పోలీసులు, అధికారులు మాట్లాడుతూ, ఉద్దండరాయునిపాలెంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగిందన్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు శంకుస్థాపనా ఏర్పాట్లకు ఆటంకం కల్గించినా, కుటుంబ సభ్యులతో సెల్ఫీలు దిగినా ఇప్పటివరకు వారిని అనుమతించామన్నారు. స్థానికుల ఉత్సాహాన్ని నీరుగార్చడం ఇష్టంలేకనే వారిని అనుమతించాల్సి వచ్చిందన్నారు. అయితే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ముహూర్తం సమీపిస్తుండటంతో ఇకపై సందర్శకులను అనుమతించేది లేదని చెప్పారు. కాగా, సందర్శకుల రాకపోకలపై కేంద్ర నిఘా సంస్థ, ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News