: రామోజీరావుతో దిగ్విజయ్ సింగ్ ప్రైవేటు సమావేశం!


ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్, నిన్న ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును కలిశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన వీరు కాసేపు సమావేశమయ్యారు. చాలా రోజుల తరువాత మర్యాదపూర్వకంగానే తాను రామోజీరావును కలిసినట్టు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని అన్నారు. ముఖ్యమైన అంశాలపై ఎటువంటి చర్చలూ జరగలేదని వివరించారు. ఇటీవలి కాలంలో రామోజీరావును పలువురు రాజకీయ నేతలు వెళ్లి కలిసి వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య జగన్ సైతం ఆయనను కలసి వచ్చారు.

  • Loading...

More Telugu News