: బాహుబలి సెట్స్ లోని ఆ గజరాజును మర్చిపోలేను: దర్శకుడు రాజమౌళి
‘బాహుబలి చిత్రం షూటింగ్ లో గజరాజు నన్ను ఆశీర్వదించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనిని ఎప్పటికీ మరచిపోలేను’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రం షూటింగుకు సంబంధించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. గజరాజు తనను ఆశీర్వదిస్తుండగా తీసిన ఫొటోను రాజమౌళి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, ప్రభాస్, రానా, నాజర్, రమ్మకృష్ణ, అనుష్క, తమన్నా తదితరులు నటించిన బాహుబలి చిత్రం రికార్డు కలెక్షన్లు రాబట్టిన చేసిన విషయం తెలిసిందే. బాహుబలి-2 చిత్రం కోసం అభిమానులు ప్రస్తుతం ఎదరుచూస్తుండటమే కాదు, దానిపై చాలా అంచనాలతో కూడా ఉన్నారు.