: ఎంఐఎం వల్లే దేశంలో ఉగ్రవాదం పెరుగుతోంది: కిషన్ రెడ్డి ఫైర్
ఎంఐఎం పార్టీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ వల్లే దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతోందని ధ్వజమెత్తారు. తమ స్వలాభం కోసం అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంఐఎంకు అలవాటేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు ఉండదని టీఆర్ఎస్ చెప్పడం పచ్చి అబద్ధమని తెలిపారు. ఎంఐఎంతో పొత్తు టీఆర్ఎస్ కు కూడా మంచిది కాదని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.