: 14 ఏళ్ల తరువాత ఆంధ్రాలో కాలుపెట్టనున్న తెలంగాణోద్యమ నేత


తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనంటూ దశాబ్దానికి పైగా ఉద్యమం నడిపి, తన కలను నెరవేర్చుకున్న తెలంగాణోద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 14 సంవత్సరాల తరువాత ఆంధ్రా ప్రాంతంలో కాలుమోపనున్నారు. కొంతకాలం క్రితం రాయలసీమ పరిధిలోని తిరుమలకు మాత్రమే వచ్చిన ఆయన, ప్రత్యేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఆంధ్రా ప్రాంతానికి ఎన్నడూ రాలేదు. ఇప్పుడాయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రత్యేక అతిథిగా రానున్నారు. మే 2010న జై ఆంధ్ర, ఏపీ దళిత మహాసభ సభ్యులు విజయవాడలో ఓ కార్యక్రమానికి కేసీఆర్ ను ఆహ్వానించినప్పటికీ, లైలా తుపాను కారణంగా అది వాయిదా పడింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే విజయవాడ దుర్గమ్మకు, తిరుమల వెంకన్నకు ప్రత్యేక ఆభరణాలు అందిస్తానని మొక్కులు మొక్కిన ఆయన, అమరావతి శంకుస్థాపన తరువాత దేవాలయాల పర్యటనలకు ఏపీకి మరలా మరలా రావచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News