: రూ. 4,999కే బ్యాంకాక్, కౌలాలంపూర్ విమాన టికెట్లు... రూ. 1,299కి దేశవాళీ ప్రయాణం
హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులో రూ. 1,500 వరకూ, ప్రైవేటు బస్సుల్లో రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్న తరుణంలో విమానయాన సంస్థల మధ్య నెలకొన్న పెను పోరు ఆకాశయానాన్ని మరింత సులభం చేస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు ఎన్నో ఆఫర్లను దగ్గర చేయగా, తాజాగా లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఆసియా ఇండియాలో తామందిస్తున్న సర్వీసుల్లో రూ. 1,299కి, అంతర్జాతీయ రూట్లలో రూ. 4,999కి ప్రయాణం టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు సంస్థ సీఈఓ మిట్టు శాండిల్య వెల్లడించారు. ఈ టికెట్లను 25వ తేదీలోపు కొనుగోలు చేయాలని, వచ్చే సంవత్సరం మార్చి 1 నుంచి అక్టోబర్ 29 మధ్య ప్రయాణం తేదీని నిర్ణయించుకోవాలని తెలిపారు. ఎయిర్ ఆసియా డాట్ కాం, ఎయిర్ ఆసియా మొబైల్ యాప్ ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ప్రతి ఒక్కరికీ విమాన ప్రయాణాన్ని దగ్గర చేయాలన్నదే తమ ఉద్దేశమని ఈ సందర్భంగా శాండిల్య వివరించారు. కాగా, ప్రస్తుతం బ్యాంకాక్, కౌలాలంపూర్ ప్రాంతాలకు ఇంటర్నేషనల్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.