: నదీ జలాలను పరిశీలించిన చంద్రబాబు
అమరావతి రాజధాని శంకుస్థాపన నిమిత్తం తీసుకువచ్చిన పుణ్య నదీజలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. దేశ వ్యాప్తంగా తీసుకొచ్చిన నదీ జలాలను విజయవాడ స్వరాజ్ మైదాన్ లో ఉంచారు. మానస సరోవర్, అలహాబాద్, త్రివేణి సంగమం, బ్రహ్మపుత్ర, యమున, ఇతర నదుల జలాలను సేకరించి తీసుకొచ్చారు. కాగా, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ప్రాంగణం నుంచి వెళ్లే వాహనాలను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించనున్నారు. వివిధ ప్రాంతాల మట్టి, పవిత్ర జలాలు శంకుస్థాపన ప్రాంతానికి తరలించనున్నారు. శంకుస్థాపన తర్వాత సీఆర్డీఏ ప్రాంతంలో మట్టి, నీటిని అధికారులు వెదజల్లనున్నారు.