: చైనాలో శునకాలకు సామూహిక వివాహాలు


సామూహిక వివాహాలు అనగానే వందల మంది వధూవరులు ఒక్కటయ్యే పెళ్లి తంతు గుర్తొస్తుంది ఎవరికైనా. కానీ, ఈ సామూహిక వివాహాలు మాత్రం చైనాలో శునకాలకు జరిగాయి. నాన్జింగ్ లో ఈ వివాహాలు ఘనంగా జరిగాయి. ముద్దొచ్చే చిన్నచిన్న కుక్కపిల్లలను చక్కగా ముస్తాబు చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్రెస్సులలో శునకాలు అదిరిపోయాయి. సుమారు 15 శునక జంటలు ఒక్కటయ్యాయి. వాటి వివాహాలు జరిగినట్లు అధికారిక ధ్రువీకరణ పత్రాలనూ అందజేశారు అధికారులు. సామూహిక వివాహాలపై శునక యజమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాటితో కలిసి ఫొటోలు దిగారు.

  • Loading...

More Telugu News