: నెల రోజుల్లో 90 శాతం లాభాలిచ్చిన ఎయిర్ లైన్స్ కంపెనీ ఇది!


ఇండియాలోని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సహా, పలు కంపెనీలు లాభాలను నమోదు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ, చౌక ధరలకు విమాన ప్రయాణాన్ని అందిస్తూ, లాభాలను నమోదు చేయడమే కాకుండా, నమ్ముకున్న ఇన్వెస్టర్లకు నెల రోజుల్లోనే 90 శాతం లాభాలను అందించింది స్పైస్ జెట్. స్పైస్ జెట్ కు పోటీగా ఉన్న ఇండిగో అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న సంస్థగా నిలిచి, ఐపీఓకు వచ్చిన ఇండిగో, ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించడంలో విజయం సాధించి, మరో వారంలో లిస్టింగ్ కు రానున్న నేపథ్యంలో, స్పైస్ జెట్ గణాంకాలు భారత విమానయాన రంగంలో కొత్త ఆశలను చిగురింపజేశాయి. గడచిన నెల రోజుల వ్యవధిలో స్పైస్ జెట్ ఈక్విటీ విలువ 90 శాతం పెరిగింది. సెప్టెంబర్ 7న రూ. 22.50గా ఉన్న ఒక్కో ఈక్విటీ విలువ ఇప్పుడు రూ. 47.55కు పెరిగింది. నేడు దాదాపు 31.7 లక్షల ఈక్విటీలు చేతులు మారాయి. మరో 25.5 లక్షల వాటాలకు డిమాండ్ ఉండగా, మరింత ధర వస్తుందన్న ఆలోచనతో ఎవ్వరూ అమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో స్పైస్ జెట్ పై ఇన్వెస్టర్ల ఆశలు ఎంతగా ఉన్నాయన్న విషయం తెలుస్తోందని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు. విమానయాన సంస్థలు నష్టాల దారిని వీడి లాభాల్లోకి వచ్చాయని, ప్రజల సంపద పెరగడం, ఆకాశయాన మార్గంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యతో పోలిస్తే, సర్వీసుల సంఖ్య తక్కువగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News